రాహుల్ ద్రవిడ్..ఆ కోపానికి కారణం ఏంటి..?
Virat Kohli Comments On Rahul Dravid. రాహుల్ ద్రవిడ్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మిస్టర్ డిపెండబుల్‌గా క్రికెట్
By Medi Samrat Published on 9 April 2021 2:46 PMరాహుల్ ద్రవిడ్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మిస్టర్ డిపెండబుల్‌గా క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. తన విజయాల గురించి మనం మాట్లాడుకోవడమే గానీ.. తాను ఎక్కువగా మాట్లాడిన సందర్భాలే లేవు. అలాంటి రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా అందరిపైకి గట్టిగా అరుస్తూ, కోపంతో ఊగిపోతూ వార్తల్లో నిలిచాడు.
అది చూసిన ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తానెప్పుడూ ఇలాంటి రాహుల్ ను చూడలేదని అంటున్నాడంటే.. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. ఐపీఎల్ ప్రారంభం నేఫథ్యంలో కొత్త కొత్త యాడ్‌లు దర్శనమివ్వడం సాదారణం. ఇప్పుడు రాహుల్ కనిపించిన ఓ యాడ్ కూడా ఆ కోవలోకి చెందిందే.
Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m
— Virat Kohli (@imVkohli) April 9, 2021
ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల యాప్‌కు సంబందించిన ఆ యాడ్‌లో రాహుల్ తన డైలాగ్ లతో హంగామా చేశాడు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి పక్క వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. బ్యాట్‌తో కారు అద్దాలను పగులగొడతాడు. అంతేకాదు.. ఇందిరానగర్ కా గూండా హు మై అంటూ ఓ భారీ డైలాగ్‌ను కూడా చెప్తాడు. ఈ వీడియోను చూసిన విరాట్.. ట్విటర్‌లో షేర్ చేస్తూ.. రాహుల్ భాయ్‌ను ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.