రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమిపై స్పందించిన విరాట్, డూప్లెసిస్

Virat Kohli breaks silence after RCB's heartbreaking exit from IPL 2023. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

By Medi Samrat  Published on  23 May 2023 9:47 AM GMT
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమిపై స్పందించిన విరాట్, డూప్లెసిస్

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ఆ జట్టు కనీసం ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేదు. దీంతో ఆ జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘లక్ష్యానికి చేరుకోలేకపోయాం. నిరాశ చెందినా, మనం తల ఎత్తుకునే ఉండాలి. ప్రతి అడుగులోనూ మాకు మద్దతుగా నిలుస్తున్న మా అభిమానులు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోచ్ లు, మేనేజ్ మెంట్, జట్టు సభ్యులకు బిగ్ థాంక్యూ అని చెప్పాడు. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శనే ఇచ్చినా, ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అర్హత లేదని ఆ జట్టు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ వ్యాఖ్యానించాడు. పోటీలోని అత్యుత్తమ జట్లలో తమది ఒకటి కాదన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో కొందరు ఆర్సీబీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఓ జట్టుగా తాము ఫలితాలను రాబట్టడంలో విఫలమైనట్టు డూప్లెసిస్ చెప్పాడు. తమ జట్టులో మిడిలార్డర్ వైఫల్యం ఉన్నట్టు చెప్పాడు. మిడిలార్డర్ లో పరుగులు చేయలేకపోవడం, మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం తమ వైఫల్యాలు అని అన్నాడు. మంచి హిట్టర్లు మిడిలార్డర్ లో లేరని, దీంతో మంచి ఫినిషింగ్ ఇవ్వలేక లీగ్ దశ నుంచే నిష్క్రమించినట్టు తెలిపాడు. బ్యాటింగ్ లో టాప్4 బాగానే ఆడారు. కానీ, సీజన్ అంతటా మిడిలార్డర్ నుంచి పరుగులు లోపించాయి. విరాట్ కోహ్లీ సీజన్ బాగా ఆడాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో 40 పరుగుల కంటే తక్కువ ఏ మ్యాచ్ లోనూ రాలేదు. మ్యాచ్ ఫినిషింగ్ లో మాత్రం మేము మరింత మెరుగుపడాలి. గతేడాది దినేష్ కార్తీక్ మ్యాచ్ లకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. కానీ, ఈ సీజన్ లో అతడి నుంచి అది లోపించిందని చెప్పుకొచ్చాడు.


Next Story