తండ్రైన విరాట్ కోహ్లీ

Virat Kohli and Anushka Sharma become parents to baby girl.భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్య‌డు. విరాట్ స‌తీమ‌ణీ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2021 5:01 PM IST
virat kohili becomes parent

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్య‌డు. విరాట్ స‌తీమ‌ణీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేశాడు. ఎంతో ఆనందంగా ఉంది అని అన్నాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం మాకు ఆడ‌బిడ్డ జ‌న్మించింది. ఈ విష‌యాన్ని మీతో పంచుకుంటున్నందుకు ధ‌న్య‌వాదాలు. త‌ల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో నూత‌న అధ్యాయ‌నం ప్రారంభం కాబోతోంది. మీ ప్రేమ‌, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఈ స‌మ‌యంలో మాకు కాస్త ప్రైవ‌సీ ఇస్తారని ఆశిస్తున్నా అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.


2017 డిసెంబ‌ర్ 11 ఇట‌లీలో అనుష్క‌, విరాట్ కోహ్లీల వివాహాం జ‌రిగింది. అనుష్క గ‌ర్భ‌వ‌తి అయిన ద‌గ్గ‌రి నుంచి వివిధ సంద‌ర్భాల్లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇరువురు అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. త‌న భార్య ప్ర‌స‌వ స‌మ‌యంలో తోడుగా ఉండాల‌ని పితృత్వ సెల‌వుల‌పై కోహ్లీ తొలి టెస్టు అనంత‌రం భార‌త్ తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విరాట్ తండ్రైన విష‌యం తెలిసిన క్రికెట‌ర్లు, అభిమానులు, సెల‌బ్రెటీలు శుబాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


Next Story