Video : రెచ్చ‌గొట్టిన పాక్ బౌల‌ర్‌కు దిమ్మ‌తిరిగే స‌మాధాన‌మిచ్చిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లే ఉండవచ్చు, కానీ అతడు ఆట‌లో మాత్రం వెనక్కి తగ్గడు.

By -  Medi Samrat
Published on : 17 Nov 2025 3:21 PM IST

Video : రెచ్చ‌గొట్టిన పాక్ బౌల‌ర్‌కు దిమ్మ‌తిరిగే స‌మాధాన‌మిచ్చిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీకి 14 ఏళ్లే ఉండవచ్చు, కానీ అతడు ఆట‌లో మాత్రం వెనక్కి తగ్గడు. పాకిస్థాన్ ఎతో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో యువ సంచలనం తన దూకుడును ప్రదర్శించాడు. సూర్యవంశీ పాకిస్తాన్‌పై మొదటి బంతికే ఫోర్ కొట్టడం ద్వారా తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. దీని తరువాత పాక్ ఫాస్ట్ బౌలర్ ఉబేద్ షా, వైభవ్ సూర్యవంశీకి మధ్య కోల్డ్ వార్ న‌డిచింది.

వైభవ్ షాట్ మిస్ అయినప్పుడల్లా.. ఉబేద్ షా అతని వైపు చూశాడు. యువ బ్యాట్స్‌మెన్‌ను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మ్యాచ్ మూడో ఓవర్లో ఉబేద్ షాపై వైభవ్ సూర్యవంశీ గట్టి ఎదురుదాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది, ఇందులో భారత ఓపెనర్ - బాల్ దాల్ నా, బాల్ దాల్ అని చెప్పడం కనిపిస్తుంది. తర్వాతి బంతికి వైభవ్ సూర్యవంశీ కవర్స్ మీదుగా అద్భుతమైన ఫోర్ కొట్టాడు. ఈ ఎన్‌కౌంటర్ త‌ర్వాత‌ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్‌కు మాట‌ల్లేవ్‌.. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.



వైభవ్ సూర్యవంశీ పాకిస్థాన్ ఏ పై 45 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అత‌డు ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్ తడబడింది. 79/1 స్కోరుతో భారత జట్టు కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని పాకిస్థాన్ పెద్దగా ఇబ్బంది పడకుండా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ వికెట్ భారత జట్టుకు టర్నింగ్ పాయింట్ అని నిరూపించబడింది. భారత జట్టు కేవలం 45 పరుగులకే తదుపరి ఏడు వికెట్లను కోల్పోయింది. పాకిస్థాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక భారత జట్టు మంగళవారం ఒమన్‌తో తలపడనుంది.

Next Story