అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతోంది. రెండో యూత్ టెస్ట్ మ్యాచ్ చెమ్స్‌ఫోర్డ్‌లో జరుగుతోంది. భారత్‌కు 355 పరుగుల విజయ లక్ష్యం ఉంది. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు.
రెండో యూత్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత్ ఎదుట 355 పరుగుల విజయలక్ష్యం ఉంది. లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు ఆరంభం కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఆ జట్టు ఏస్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్ అయ్యాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అలెక్స్ గ్రీన్ వేసిన బంతికి అతను ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా వైభవ్(20) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. వన్డేలలో చెలరేగిన సూర్యవంశీ టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రం తడపడ్డాడు. సూర్యవంశీ అవుటైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.