Video : 14 ఏళ్లకే త‌నేంటో నిరూపించుకున్నాడు.. పాక్ అభిమానుల అతి చూస్తే..

అండర్-19 ఆసియా కప్ ఫైనల్ తర్వాత భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.

By -  Medi Samrat
Published on : 23 Dec 2025 3:15 PM IST

Video : 14 ఏళ్లకే త‌నేంటో నిరూపించుకున్నాడు.. పాక్ అభిమానుల అతి చూస్తే..

అండర్-19 ఆసియా కప్ ఫైనల్ తర్వాత భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ అభిమానులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత జట్టు 191 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 348 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది.

వైభవ్ సూర్యవంశీ ఫైనల్ మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు. 10 బంతుల్లో 26 పరుగులు చేసి అలీ రాజా బౌలింగ్‌లో అవుట‌య్యాడు. వైభవ్ సూర్యవంశీ కాదు భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో జట్టు మొత్తం 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళుతుండ‌గా పాక్ అభిమానులు వైభవ్ సూర్యవంశీని తీవ్రంగా దూషించారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్టేడియం నుంచి బయటకు వెళుతున్నట్లు వీడియోలో కనిపించింది. అందులో పాక్ అభిమానులు వైభవ్ సూర్యవంశీ ప‌ట్ల‌ దురుసుగా ప్రవర్తించారు. వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏమీ మాట్లాడకుండా శాంతియుతంగా వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సూర్యవంశీ అవుట్ అయినప్పుడు ఫాస్ట్ బౌలర్ అలీ రాజాతో గొడవపడ్డాడు. వైభవ్‌ను అవుట్ చేసిన తర్వాత రాజా కొన్ని మాటలు చెప్పాడు. దానికి వైభవ్ బ‌దులిచ్చాడు.

అండర్-19 ఆసియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు UAEపై కేవలం 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 171 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత మలేషియాపై 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే సెమీ ఫైనల్, ఫైనల్‌లో వైభవ్ విఫ‌ల‌మ‌య్యాడు. సూర్యవంశీ ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాయంతో 261 పరుగులు చేశాడు. అతని సగటు 52.20.

Next Story