యూఎస్ ఓపెన్‌.. ఫైన‌ల్ చేరిన జ‌కోవిచ్‌

US Open 2021 Novak Djokovic beats Alexander Zverev.యూఎస్‌ ఓపెన్‌లో స్టార్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్ త‌న హ‌వా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 4:44 AM GMT
యూఎస్ ఓపెన్‌.. ఫైన‌ల్ చేరిన జ‌కోవిచ్‌

యూఎస్‌ ఓపెన్‌లో స్టార్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్ త‌న హ‌వా కొన‌సాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లాడు. శ‌నివారం జ‌రిగిన సెమిస్‌లో టోక్యో ఒలింపింక్స్ స్వ‌ర్ణ ప‌త‌క విజేత అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్‌పై విజ‌యం సాధించాడు. హోరా హోరీగా జ‌రిగిన ఈ మ్యాచ్ జ‌కోవిచ్‌.. 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో గెలుపొంది ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. ఆదివారం రెండో సీజ్‌ఆట‌గాడు డానిల్ మెద్వెదెవ్‌తో పైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నున్నాడు. ఈ టైటిల్‌ను క‌నుక గెలిస్తే.. అత్య‌ధిక గ్రాండ్​స్లామ్​ లు గెలిచిన ఆట‌గాడిగా జ‌కో చరిత్ర సృష్టించ‌నున్నాడు. దీంతో పాటు 52 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్​ క్యాలెండర్ ఇయర్​ గ్రాండ్స్​ స్లామ్​ గెలిచిన ఆటగాడిగా నిలువనున్నాడు.Next Story
Share it