ఉన్ముక్త్ చంద్ అవుట్.. అమెరికా జట్టులో ఆ విధ్వంసక ఆటగాడు
అమెరికా క్రికెట్ జట్టు ద్వారా టీ20 ప్రపంచ కప్ ఆడాలని భావించిన భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ఆశలు అడియాశలు అయ్యాయి.
By Medi Samrat Published on 4 May 2024 8:15 AM GMTఅమెరికా క్రికెట్ జట్టు ద్వారా టీ20 ప్రపంచ కప్ ఆడాలని భావించిన భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఉన్ముక్త్ చంద్ కు అమెరికా జట్టులో స్థానం దక్కలేదు. జూన్‌లో జరిగే T20 ప్రపంచ కప్ కోసం USA కు చెందిన 15 మంది సభ్యుల జట్టులో విధ్వంసక ఆటగాడు కోరీ అండర్సన్ భాగమయ్యాడు. ఏప్రిల్‌లో కెనడాతో జరిగిన T20I సిరీస్‌కు చంద్ ను జట్టులో చేర్చుకోలేదు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలనే చాంద్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పుడు అతన్ని అమెరికా ప్రపంచ కప్ జట్టు నుండి కూడా మినహాయించారు.
కెనడా సిరీస్ నుండి తనను తప్పించిన తర్వాత చంద్ మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇచ్చి ఉండాలని చెప్పాడు. ఏప్రిల్‌లో జరిగిన సిరీస్‌లో 6 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు అండర్సన్. అండర్సన్ చివరిసారిగా 2018లో న్యూజిలాండ్ తరపున ఆడాడు. మూడు ఫార్మాట్లలో 93 సార్లు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. USA జట్టుకు మోనాంక్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆరోన్ జోన్స్ అతని డిప్యూటీగా వ్యవహరిస్తాడు. అనుభవజ్ఞుడైన పేసర్ అలీఖాన్ కూడా జట్టులోకి వచ్చాడు. జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నారు.
T20 ప్రపంచ కప్ 2024 కోసం USA జట్టు:
జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), స్టీవెన్ టేలర్, కోరీ అండర్సన్, సౌరభ్ నేత్రావల్కర్, జెస్సీ సింగ్, హర్మీత్ సింగ్, నోష్టుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నితీష్ కుమార్, ఆండ్రీస్ గౌస్, షాయన్ జహంగీర్, అలీ ఖాన్ నిసర్గ్ పటేల్, మిలింద్ కుమార్
రిజర్వ్ ప్లేయర్స్: గజానంద్ సింగ్, జువానో డ్రైస్‌డేల్, యాసిర్ మహ్మద్.