జాతీయ జ‌ట్టులో స్థానం సంపాదించిన ముంబై ఇండియ‌న్స్ కుర్రాడు..!

వెస్టిండీస్‌తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

By Medi Samrat  Published on  14 Aug 2024 2:46 PM GMT
జాతీయ జ‌ట్టులో స్థానం సంపాదించిన ముంబై ఇండియ‌న్స్ కుర్రాడు..!

వెస్టిండీస్‌తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 18 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా, ఆల్ రౌండర్ జాసన్ స్మిత్‌లు తొలిసారి దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్వేనా మఫాకా నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు తీశాడు. టోర్నీలో మూడు సార్లు ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన‌ మఫాకా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ‌రో ఆట‌గాడు స్మిత్‌కు దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆడిన మంచి అనుభవం ఉంది. ప్రొటీస్ వైట్-బాల్ కోచ్ రాబ్ వాల్టర్ మఫాకా, స్మిత్‌లను జ‌ట్టులో చేర్చుకోవడంపై త‌న‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

కోచ్ మాట్లాడుతూ.. “జాసన్ స్మిత్, క్వేనా మఫాకా జట్టులోకి రావడంతో మేము సంతోషిస్తున్నాము. జాసన్ ఇటీవలి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అతడు బ్యాట్, బాల్‌తో రాణించే సామర్థ్యం మా జట్టుకు మరింత బ‌లాన్ని జోడిస్తుంది. క్వెనాకు చాలా ప్రతిభ ఉంది. ఈ పర్యటన అతనికి విలువైన అంతర్జాతీయ అనుభవాన్ని పొందే అవకాశాన్ని ఇస్తుందన్నాడు. డేవిడ్ మిల్లర్, తబ్రైజ్ షమ్సీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడాలకు దక్షిణాఫ్రికా విశ్రాంతినిచ్చింది.


వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్ట్ 23న జరుగుతుంది. దీని తరువాత తదుపరి రెండు మ్యాచ్‌లు వరుసగా ఆగస్టు 25, 27 న జరుగుతాయి. మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

దక్షిణాఫ్రికా జట్టు

ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బెర్గర్, డోనోవన్ ఫెర్రీరా, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, పాట్రిక్ క్రూగర్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎన్‌గిడి, ర్యాన్ రికిల్‌టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విల్సేన్స్ వాన్.

Next Story