ఆ ఇద్దరు ఆటగాళ్ల కారణంగానే ఓట‌మి : రోహిత్

Travis Head, Steve Smith centuries caught us off guard. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టుకు ఘోర పరాభ‌వం ఎదురైంది.

By Medi Samrat  Published on  11 Jun 2023 3:30 PM GMT
ఆ ఇద్దరు ఆటగాళ్ల కారణంగానే ఓట‌మి : రోహిత్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టుకు ఘోర పరాభ‌వం ఎదురైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో భారత్‌ 444 పరుగుల లక్ష్యాన్ని చేధించ‌లేక‌.. కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయ్యి 209 పరుగుల తేడాతో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేసి.. టీమిండియా నుండి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఓటమి తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచి శుభారంభం చేశామని.. ఆరంభంలో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. మొదటి సెషన్‌లో మేము బాగా బౌలింగ్ చేసాము, కానీ ఆ తర్వాత మేము బౌలింగ్ చేసిన విధానం మమ్మల్ని నిరాశపరిచింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను మెచ్చుకోవాలి. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ బాగా ఆడారు. వారి బ్యాటింగ్‌తో మేం కాస్త కలవరపడ్డాం. తిరిగి ఫైన‌ల్‌కు రావడం కష్టమని మాకు తెలుసు. చివరి వరకు పోరాడామని, చాలా కష్టపడ్డామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండు ఫైనల్స్‌లో ఆడడం మాకు మంచి విజయం. గత రెండేళ్లలో మేము సాధించిన వాటికి మీరు క్రెడిట్ తీసుకోలేరు. ఫైనల్ వ‌ర‌కూ వెళ్లి గెలవలేకపోవడం దారుణం. ప్రతి పరుగు, ప్రతి వికెట్‌కు మమ్మల్ని ప్రోత్సహించిన అభిమానులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని అన్నారు.

ఆస్ట్రేలియా తరపున హెడ్ 163, స్మిత్ 121 పరుగులు చేశారు. ఈ ఆటగాళ్ల సెంచరీల కారణంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 173 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 270 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంత‌రం బ్యాట్స్‌మెన్ కూడా విఫ‌ల‌మ‌వ‌డంతో ఓట‌మి చెందాల్సివ‌చ్చింది.


Next Story