ఇసుక తుఫాను వచ్చేసింది.. చెన్నై-బెంగళూరు మ్యాచ్ టాస్ లేట్

Toss is delayed due to sandstorm. ఈరోజు ఐపీఎల్ లో సూపర్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు

By Medi Samrat  Published on  24 Sep 2021 2:05 PM GMT
ఇసుక తుఫాను వచ్చేసింది.. చెన్నై-బెంగళూరు మ్యాచ్ టాస్ లేట్

ఈరోజు ఐపీఎల్ లో సూపర్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో ఈ రెండు జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ లు జరిగాయి. ఈ ఏడాది కూడా అభిమానులు ఎంతగానో ఈరోజు వెయిట్ చేస్తూ ఉండగా ఊహించని విధంగా టాస్ లేట్ అయింది. చెన్నై-బెంగళూరు మ్యాచ్ కు ఇసుక తుఫాను అడ్డం వచ్చింది. దీంతో టాస్ లేట్ అయింది. గతంలో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన మ్యాచ్ లకు ఇసుక తుఫానులు అంతరాయం కలిగించాయి. ఇప్పుడు కూడా మరో ఇసుక తుఫాను ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందా అన్నది అంపైర్స్ చెప్పాల్సి ఉంది.

ఇసుక తుఫాను కారణంగా షెడ్యూల్ ప్రకారం 7 గంటలకి టాస్ వేయలేకపోయారు. టాస్‌ కోసం మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీతో పాటు మ్యాచ్ అధికారులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. గత రెండు సీజన్లలో కలిపి నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా.. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఒకసారి ఢీకొనగా.. ఆ మ్యాచ్‌లో చెన్నై టీమ్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతీకారం కోసం బెంగళూరు కూడా ఎదురుచూస్తూ ఉంది.


Next Story