నాలుగు వందలకుపైగా మ్యాచ్‌లాడి నెంబర్-1 ర్యాంక్ సాధించలేకపోయిన ఐదుగురు స్టార్ ఆటగాళ్లు వీరే..!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల ర్యాంకింగ్‌ను ICC నిర్ణయిస్తుంది. వారి ఆటతీరు ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఉంటుంది.
By Medi Samrat Published on 28 Aug 2024 9:23 PM ISTఅంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల ర్యాంకింగ్‌ను ICC నిర్ణయిస్తుంది. వారి ఆటతీరు ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఉంటుంది. ప్రతి టోర్నీ, సిరీస్ తర్వాత ర్యాంకింగ్ లో మార్పులు ఉంటాయి. వన్డేతో పాటు టెస్టు, టీ20ల్లో ర్యాంకింగ్ ఉంది. బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్ ర్యాంక్‌లను కలిగి ఉంటారు. ఇది కాకుండా జట్టు ర్యాంక్ కూడా ఉంటుంది. అత్యధిక మ్యాచ్‌లు ఆడినా నంబర్ 1కి చేరుకోలేకపోయిన 5 మంది ఆటగాళ్ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో ఇంకా నంబర్-1కి చేరుకోలేదు. ఇప్పటి వరకూ రోహిత్ 483 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లందరూ నంబర్ వన్‌గా నిలిచారు. రోహిత్ ఇంకా ఆడుతున్నాడు కాబట్టి నంబర్-1కి చేరుకునే అవకాశం ఉంది.
మార్క్ బౌచర్
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ మార్క్ బౌచర్ రెండో స్థానంలో నిలిచాడు. 1997లో అరంగేట్రం చేసి 2012లో చివరి మ్యాచ్ ఆడాడు. 467 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మార్క్ బౌచర్ తన కెరీర్‌లో ఎప్పుడూ నంబర్-1 ర్యాంక్ సాధించలేకపోయాడు.
ముష్ఫికర్ రహీమ్
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ కూడా ఎప్పుడూ నంబర్-1కి చేరుకోలేకపోయాడు. తన కెరీర్‌లో 462 మ్యాచ్‌లు ఆడాడు. గతవారం పాకిస్థాన్‌తో జరిగిన రావల్పిండి టెస్టులో 191 పరుగులు చేసి బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
రాస్ టేలర్
450 మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్-1గా నిలవలేకపోయాడు. రాస్ టేలర్ అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. టెస్టుల్లో అతని సగటు 45 కాగా.. వన్డేల్లో 47.5గా ఉంది. టేలర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.
షోయబ్ మాలిక్
జాబితాలో 5వ, చివరి పేరు పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్. 1999లో అరంగేట్రం చేసిన మాలిక్.. 2021 నుంచి పాక్ జట్టుకు దూరమయ్యాడు. బ్యాటింగ్‌లో అద్భుతమైన రికార్డుతో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేశాడు. 446 మ్యాచ్‌లు ఆడినా నంబర్-1 ర్యాంక్ సాధించలేకపోయాడు.