బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌.. బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ

Today IPL Matches Update. ఐపీఎల్‌ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మ‌ధ్య జ‌రుగుతుంది.

By Medi Samrat  Published on  8 Oct 2021 2:27 PM GMT
బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌.. బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ

ఐపీఎల్‌ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మ‌ధ్య జ‌రుగుతుంది. టాస్‌ గెలిచిన ముంబయి జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్‌ 13 మ్యాచులు ఆడగా.. ఆరింట్లో విజయం సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌ జట్టు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం మూడింట్లో నెగ్గి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఇక మ‌రో మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జ‌రుగుతుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. పది విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న దిల్లీ.. ఈ మ్యాచులో కూడా విజయం సాధించి ఆధిపత్యం కొనసాగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు బెంగళూరు జట్టు చివరి మ్యాచులో హైదరాబాద్ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఆ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది.


Next Story
Share it