వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..

ఐసీసీ ప్రపంచ కప్ 2023కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది.

By Medi Samrat  Published on  16 Sep 2023 10:09 AM GMT
వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..

ఐసీసీ ప్రపంచ కప్ 2023కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన‌ నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తీవ్రంగా గాయపడ్డాడు. సౌదీ ప్రపంచకప్ వరకు ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది కష్టంగా మారింది. నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ చేతిలో 100 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది.

ఇంగ్లండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో జో రూట్ క్యాచ్‌ అందుకునే ప్ర‌య‌త్నంలో సౌదీకి గాయమైంది. సౌదీ కుడి చేతి బొటనవేలు ఎముక విరిగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. దీని కారణంగా అతడు నొప్పితో మెదానంలో కుప్ప‌కూలిపోయాడు.

అనంత‌రం మైదానం వీడిన సౌథీ.. మళ్లీ మైదానంలోకి రాలేకపోయాడు. సౌథీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. టిమ్ సౌథీ గాయం న్యూజిలాండ్ జట్టులో టెన్షన్ పెంచింది. 2023 ప్రపంచకప్‌ నుంచి సౌదీ నిష్క్రమిస్తే కివీస్ జట్టుకు అది పెద్ద దెబ్బే అవుతుంది.

సిరీస్‌లోని చివరి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. జట్టు తరపున డేవిడ్ మలన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా 36 పరుగులు చేశాడు. 312 పరుగుల లక్ష్యానికి సమాధానంగా న్యూజిలాండ్ 211 పరుగులకే ఆలౌటైంది.

న్యూజిలాండ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక‌పోయారు. రచిన్ రవీంద్ర అత్యధికంగా 61 పరుగులు చేశాడు. అయితే అవతలి ఎండ్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి అతనికి మద్దతు లభించలేదు. దీంతో కివీస్‌ ఓట‌మి త‌ప్ప‌లేదు. వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంది.

Next Story