ఆసీస్‌తో ఫైనల్.. కాన్వే ఔట్.. ఎవరొచ్చారంటే..?
Tim Seifert set to replace injured Devon Conway in T20 World Cup final.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ తుది దశకు
By తోట వంశీ కుమార్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ తుది దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా రేపు(ఆదివారం) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ డేవాన్ కాన్వే గాయంతో ఫైనల్‌కు దూరం అయ్యాడు. సెమీపైనల్ మ్యాచ్‌లో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కాన్వే.. ఔటైన తరువాత అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి పొరబాటున కొట్టుకోవడంతో గాయమైంది. దీంతో పైనల్‌కు అతడు దూరం అయ్యాడు. నిజంగా కివీస్‌కు ఇది ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
అతడి స్థానంలో న్యూజిలాండ్ జట్టు ఎవరిని ఎంపిక చేస్తుందా..? అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అతడి స్థానంలో టీమ్ స్టీఫెర్ట్‌ను తీసుకుంటున్నట్లు కివీస్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పైనల్‌తో పాటు భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా స్టీఫెర్ట్ ని తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక స్టీపెర్ట్ ఇప్పటి వరకు 36 టీ20ల్లో కివీస్ తరుపున ప్రాతినిధ్యం వహించి 703 పరుగులు చేశాడు. ఇక ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా కివీస్ ఎవరు విజయం సాధించినా.. ఓ కొత్త ఛాంఫియన్ ను చూడడం ఖాయం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ గానీ ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. సెమీస్‌లో ఇరు జట్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించాయి. ఓడిపోతారని అనుకున్న మ్యాచ్‌లను గెలిచి ఇరు జట్లు ఫైనల్‌కు చేరాయి. దీంతో ఫైనల్ మరింత ఆసక్తిగా మారింది.