బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా అయింది. గాబ్బాలో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా దెబ్బతింది. చివరి రోజు భారత్ విజయానికి 275 పరుగులు చేయాల్సి ఉంది. అయితే టీ టైం తర్వాత వర్షం కురిసింది. దీంతో ఆట ముగిసింది. మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసింది. మూడు మ్యాచ్‌లు ముగియగా.. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది.
ఐదో రోజు ఆటలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కంగారూ జట్టు 89/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ముందు ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా మూడు, ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన 274 పరుగుల లక్ష్యచేధనతో బరిలో దిగిన భారత్.. వికెట్లేమి కోల్పోకుండా 8 పరుగులు చేసింది. ఆపై వర్షం మ్యాచ్‌ను మింగేసింది. దీంతో మూడో టెస్టు డ్రా గా ముగిసింది.