చేత‌న్ స‌కారియా.. విజ‌యం వెనుక క‌నిపించ‌ని విషాదాలు

The unseen tragedies behind the success.చేత‌న్ స‌కారియా.. ప్ర‌స్తుతం ఈ పేరు మారుమోగి పోతుంది. ఓవ‌ర్ నైట్‌లో స్టార్ అయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2021 10:36 AM GMT
Chetan Sakaria

చేత‌న్ స‌కారియా.. ప్ర‌స్తుతం ఈ పేరు మారుమోగి పోతుంది. ఓవ‌ర్ నైట్‌లో స్టార్ అయ్యాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ నాలుగు ప‌రుగుల తేడాతో ఓడిన‌ప్ప‌టికి.. ఓ కుర్రాడు మాత్రం అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. అత‌డే చేత‌న్ స‌కారియా. మీడియం ఫాస్ట్ బౌల‌ర్ అయిన స‌కారియా.. నాలుగు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 31 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు. సీనియ‌ర్ల బౌలింగ్ ఎకాన‌మీ 10 పైగా ఉండ‌గా.. అత‌డు మాత్రం 7.75 ఎకానిమీతో బౌలింగ్ చేయ‌డం విశేషం.

23 ఏళ్ల చేత‌న్ ను వేలంలో రాజ‌స్థాన్ రూ.1.2కోట్ల‌కు ద‌క్కించుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వార్జెజ్ లో జన్మించిన ఈ లెఫ్టార్మ్ పేసర్ సకారియా.. ఓ దశలో బూట్లు లేకుండా కూడా క్రికెట్ ఆడాడు. క్రికెట్ మీద మక్కువతో టెన్నిస్ బంతితో తొలుత బ్యాటింగ్ మీదనే దృష్టి పెట్టినప్పటికీ ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 16 ఏళ్ల వయస్సు వ‌ర‌కు ఎలాంటి శిక్ష‌ణ లేకుండానే సొంత నైపుణ్యంతో ఆక‌ట్టుకున్నాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర తరఫున జూనియర్ జట్టులో చేరాడు. 17 ఏళ్ల వయస్సులో గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఈ సమయంలో కుటుంబ పోషణ కోసం తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ గుమస్తాగా పనిచేశాడు.

అనంత‌రం కూచ్ బెహార్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసి(6 మ్యాచుల్లో 18 వికెట్లు) చ‌రిత్ర సృష్టించాడు. ఆతరువాత MRF పేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా దిగ్గ‌జ పేసర్ మెక్ గ్రాత్ వద్ద శిక్షణ పొందే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అక్క‌డ అత‌డి బౌలింగ్‌కు ఫిదా అయిన సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ షెల్డ‌న్ జాక్స‌న్ అతడికి ఓ జ‌త బూట్లు ఇచ్చాడు. 2018-19 సీజన్ రంజీల్లో ఆడడం ప్రారంభించాడు. అక్క‌డ కూడా స‌త్తా చాటాడు. అయితే.. అత‌డి జీవితం పూల పానుపు ఏమీ కాదు. ప్ర‌మాదం కార‌ణంగా తండ్రి మంచాన ప‌డ్డాడు. త‌ల్లి ప‌నుల‌కు వెళ్ల‌క‌.. తాను ఎంతో ప్రేమించే సోద‌రుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు అత‌డికి పెద్ద ప‌రీక్ష‌లు పెట్టాయి. అయితే.. అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డి తాను అనుకున్న‌ది సాధించాడు చేత‌న్ స‌కారియా.


Next Story