ఎట్టకేలకు టీ20 ఫైనల్ మ్యాచ్ సూపర్ క్యాచ్‌పై స్పందించిన సూర్య
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది.
By Srikanth Gundamalla Published on 3 July 2024 6:52 AM IST
ఎట్టకేలకు టీ20 ఫైనల్ మ్యాచ్ సూపర్ క్యాచ్‌పై స్పందించిన సూర్య
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలిచి కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఆ క్యాచే ఫైనల్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భారత్‌ను విజయానికి చేరువ చేసింది. 20 ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ లాంగ్ ఆఫ్‌లో బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్యాచ్ పట్ల ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ప్రశంసలు కురిపించారు. కానీ..ఇది క్యాచ్ కాదనీ.. సిక్సర్ అంటూ పలువురు పేర్కొన్నారు. వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ తన క్యాచ్‌పై తొలిసారి స్పందించాడు.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ తన క్యాచ్ గురించి మాట్లాడాడు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తనతో పాటు విరాట్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఎప్పుడూ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఫీల్డింగ్ చేయాలని చెప్పాడని గుర్తు చేశాడు. బంతి ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో ఉండాలన్నారు. తాను పట్టిన క్యాచ్‌ను అనేక మైదానాల్లో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు సూర్య. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను ఎలాగైనా పట్టుకోవాలని ఆ సమయంలో మనసు చెప్పిందన్నాడు. బంతి తనవైపు వస్తున్న క్రమంలో రోహిత్ వైపు చూశాననీ అన్నాడు. రోహిత్ దగ్గరగా ఉంటే అతని వైపు విసిరేవాడిని కానీ.. అతను దగ్గరగా లేకపోవడంతో రెండో ప్రయత్నంలో కూడా తానే క్యాచ్ తీసుకున్నట్లు సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు.
ఆ కొద్ది సెకన్లలో ఏం జరిగిందనేది మాటల్లో కూడా వివరించలేనని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్యాచ్‌పై భారీ స్పందన రావడం సంతోషంగా ఉందన్నాడు. తనకు మెసేజ్‌లు భారీగా వస్తున్నాయన్నాడు. తాన క్యాచ్ పట్టి బయటకు విసిరిన సమయంలో రోప్‌ను తాకలేదనే విసయం తనకు తెలుసన్నాడు. మళ్లీ క్యాచ్ పట్టినప్పుడు కూడా రోప్‌ను తాకలేదని సూర్య చెప్పుకొచ్చాడు. అది పర్ఫెక్ట్ క్యాచ్ అన్నాడు. మ్యాచ్‌కు ముందు శిక్షణ తీసుకున్నామని ఎప్పాడు. హైక్యాచ్‌లు.. ఫ్లాట్ క్యాచ్‌లు, డైరెక్ట్ హిట్, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీ చేశామని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.