IND Vs ENG: జురెల్‌కు ఫస్ట్‌ సెంచరీ మిస్‌, స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్

రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 12:29 PM IST
team india, test cricket, england, 4th test ,

IND Vs ENG: జురెల్‌కు ఫస్ట్‌ సెంచరీ మిస్‌, స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్

రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. మూడోరోజు తొలి సెషన్‌లో ఇండియా ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా ప్లేయర్‌ ధ్రువ్‌ జురెల్‌ చివరి వరకు పోరాడాడు. 149 బంతుల్లో 90 పరుగులు చేశాడు. దాంతో.. భారత్ స్కోర్‌ 300 దాటింది. జురెల్‌ పట్టుదలగా ఆడటంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కింది. అయితే.. 90 పరుగుల వద్ద జురెల్ అనుహ్యంగా పెవిలియన్‌కు చేరాడు. తద్వారా టెస్టుల్లో తన ఫస్ట్‌ సెంచరీని మిస్ చేసుకున్నాడు.

టామ్‌ హార్ట్‌లే బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేకపోయిన జురెల్ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 307 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్‌ బషీర్‌ ఐదు వికెట్లు పడగొట్టి స్టార్‌గా నిలిచాడు. ఆకాశ్‌దీప్‌ను ఎల్బీగా ఔట్‌ చేసి ఐదో వికెట్ సాధించాడు. అయితే.. టీమిండియా ఓవర్‌నైట్‌ స్కోర్‌ 219/7తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. కాసేపటికే కుల్దీప్‌ 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆకాశ్‌ దీప్‌ 9 పరుగులు చేశాడు. జురెల్‌కు సహకరించాడు. బషీర్‌ను టార్గెట్‌ చేసిన అతను సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే.. ఆకాశ్‌ ఔటైన కాసేపటికే ధ్రువ్ జురెల్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. సెంచరీని చేజార్చుకున్నా కూడా టీమిండియాను ఒడ్డున పడేశాడు.

ఇక నాలుగో టెస్టులో ఓపెన్ యశస్వి జైస్వాల్ 73 పరుగులు (8 ఫోర్లు, ఒక సిక్సర్) చేశాడు. శుభ్‌మన్ గిల్ (38) పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు. ఇక అంతకుముందు రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ విఫలం అయ్యడు. రజత్ పాటిదార్ (17), జడేజా (12), సర్ఫరాజ్‌ ఖాన్ (14), అశ్విన్‌ (1) పరుగులు చేశారు. ఒకానొక దశలో టీమిండియా 300 పరుగులు చేయలేని ప్రమాదంలో ఉన్న భారత్‌ను జురెల్‌ ఆదుకున్నాడు. 90 పరుగులు చేసి టీమిండియాను నిలబెట్టాడు.


Next Story