IND Vs ENG: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్!
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 10:54 AM ISTIND Vs ENG: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్!
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఒక రోజు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. రెండో టెస్టు మ్యాచ్ కోసం రెండు టీమ్‌లు రెడీ అవుతున్నాయి. రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
తొలి టెస్టు సందర్భంగా జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో ఆల్‌రౌండర్ జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో.. అతను రన్ అవుట్ కావడే కాదు.. రెండు టెస్టులో ఆడటం అనుమానమే అంటున్నారు. జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జడేజా గాయం తీవ్రతపై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది. ఇక తొలి టెస్టు తర్వాత ప్రెస్‌మీట్‌లో ఇదే విషయంపై పలువురు ప్రశ్నించగా.. స్పందించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరాకరించాడు. కాగా.. విశాఖ వేదికగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఆదివారమే విశాఖకు చేరుకుంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇండియాపై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యాన్ని సాధించి కూడా ఓటమిని చవిచూసింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి రాణించాడు. తొలి మ్యాచ్‌లో జడేజా మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలం అయ్యాడు. 2 పరుగుల వద్ద తొడ కండరాలు పట్టేయడంతో పరుగు తీసే క్రమంలో రన్ అవుట్ అయ్యాడు.