జింబాబ్వేతో అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ గిల్

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ విజేతగా నిలిచిన తర్వాత.. భారత్ వైపు యావత్‌ ప్రపంచం చూసింది.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 4:43 AM GMT
team india, loss, match,  zimbabwe, t20 cricket ,

జింబాబ్వేతో అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ గిల్ 

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ విజేతగా నిలిచిన తర్వాత.. భారత్ వైపు యావత్‌ ప్రపంచం చూసింది. అయితే.. ఈ టోర్నీ తర్వాత భారత యంగ్‌ ప్లేయర్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లారు. రోహిత్, విరాట్, హార్డిక్, సూర్య తో పాటు సీనియర్లు లేకుండా టీమ్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే.. తొలి మ్యాచ్‌లో భారత్‌కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. 102 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు.

శుభ్‌మన్ గిల్‌ మాట్లాడుతూ..'ఈ ఓటమి ఎంతో నిరాశపరిచింది. ప్రతి ఒక్క బ్యాటర్ స్వేచ్ఛగా ఆడాలన్నది మా ప్లాన్. కానీ అది జరగలేదు. ఒకరి తర్వాత మరొకరు వెంటవెంటనే ఔట్‌ అయ్యారు. ఇన్నింగ్స్‌ సగం ముగిసే సరికే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డాం. మొదట నేను క్రీజులో ఉన్నప్పుడు గెలుస్తామని అనుకున్నాం. నేను ఔట్ అయిన తర్వాత గేమ్‌ స్వరూపమే మారిపోయింది. ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై సమీక్షించుకుంటాం. ఈ సిరీస్‌లో మిగతా మ్యాచుల్లో కచ్చితగా రాణిస్తాం. తప్పకుండా ఓటమి రిపీట్ అవ్వకుండా చూస్తాం' అని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు.

జింబాబ్వేతో టీమిండియా ఓటమిని చూస్తుందని ఎవరూ ఊహించలేదు. ఐపీఎల్‌లో రాణించిన ప్లేయర్లు ఉండటంతో కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ.. బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరడం ఆశ్చర్యానికి గురి చేసింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అనూహ్యంగా తడబడింది. 102 పరుగులకే కుప్పకూలి 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాణిస్తారని ఆశలు పెట్టుకున్న ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ (0), రుతురాజ్ గైక్వాడ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్(0), ధ్రువ్ జురెల్‌ (6)లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Next Story