IND Vs ENG: శుభ్‌మన్‌ గిల్‌పై నెటిజన్ల విమర్శలు

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 8:08 AM GMT
team india, england, test series, shubman gill,

IND Vs ENG: శుభ్‌మన్‌ గిల్‌పై నెటిజన్ల విమర్శలు 

టీమిండియా స్టార్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పై టీమిండియా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అతని ఆటతీరుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే.. గిల్‌ పొట్టి, వన్డే ఫార్మాట్లలో అద్భుతంగా రాణించాడు. కానీ.. టెస్టుల్లో మాత్రం తడబడుతున్నాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్‌ టీమ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి బ్యాటింగ్‌ ప్రదర్శనలో తనదైన మార్క్‌ను చూపించలేకపోయాడు.

శుభ్‌మన్‌ గిల్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొని కేవలం 23 పరుగులే చేశాడు. అంతేకాదు.. తన ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి ఇబ్బంది పడ్డాడు. మెల్లిగా ఆడుతూ వచ్చిన గిల్‌ చివరకు టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. ఇక అంతకుము ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా గిల్‌ పేలవ ప్రదర్శనే కనబరిచాడు. వైట్‌ బాల్‌ ఫార్మాట్లలో అదరగొడుతున్న యువ ఓపెన్ గిల్‌.. టెస్టుల్లో మాత్రం గత 8 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దాంతో.. నెటిజన్లు శుభ్‌మన్‌ గిల్‌పై విమర్శలు చేస్తున్నారు. గిల్‌ టెస్టు మ్యాచ్‌లకు పనికిరాడంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

శుభ్‌మన్‌ గిల్‌ తన చివరి 8 ఇన్నింగ్స్‌లలో స్కోర్లు చూసినట్లు అయితే.. (6) (10), (29*), (2), (26) (36),(10), (23)గా ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు గిల్‌పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. గిల్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో రజిత్‌ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇంకొందరు తమకు నచ్చిన ఆటగాళ్ల పేర్లను పెడుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.మరికొందరు మాత్రం గిల్‌ గతంలో ఆడిన తీరుని మర్చిపోవద్దనీ.. ఆటలో ఇవన్నీ సహజమని చెబుతున్నారు కాగా.. ఓవరాల్‌గా శుభ్‌మన్‌ గిల్‌ కెరియర్‌లో ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడగా.. 1,063 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

Next Story