IND Vs ENG: టెస్ట్ క్రికెట్‌లో రజత్ పాటిదార్ అరంగేట్రం
భారత్ వేదికగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 10:44 AM ISTIND Vs ENG: టెస్ట్ క్రికెట్‌లో రజత్ పాటిదార్ అరంగేట్రం
భారత్ వేదికగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచింది. 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. రెండో టెస్టు ఇవాళ్టి నుంచే ప్రారంభం అయ్యింది. విశాఖ వేదికగా ఈ రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. కాగా.. ఈ మ్యాచ్‌టోల మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు భారత తుది జట్టులో కూడా అతను చోటు దక్కించుకున్నాడు. భారత్ తరపున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు.
రెండో టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదుగా పాటిదార్ క్యాప్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. నెటిజన్లు రజత్ పాటిదార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు టీమిండియా క్రికెట్ అభిమానులు. బెస్ట్ విషెష్ చెబుతున్నారు. కాగా.. రజత్ పాటిదార్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4వేల పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 సెంచరీలు.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తొలి టెస్టులో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దాంతో.. అతను రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. మరోవైపు ఈ టెస్టు మ్యాచ్‌లో ముఖేష్ కుమార్ కూడా తుది జట్టులోకి వచ్చాడు.
టీమిండియా తుది జట్టు: రోహిత్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేశ్ కుమార్, కుల్దీప్
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్