టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ దీప్తి శర్మకు అరుదైన గౌరవం లభించింది.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 12:15 PM GMT
team india, cricketer, deepti sharma, uttar pradesh govt,

టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ దీప్తి శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆల్‌రౌండర్‌ అయిన దీప్తి శర్మను సన్మానించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సూపరిటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. ఇండియన్‌ క్రికెట్‌ జట్టు తరఫున ఆడుతోన్న దీప్తి శర్మ గత కొంత కాలంగా బాగా రాణిస్తోంది. టీమిండియా గెలుపులో తనవంతు పాత్రను పోషిస్తోంది. ఇందుకుగాను ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సీఎం యోగి సర్కార్‌ దీప్తి శర్మను సత్కరించింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. తన డీఎస్పీ హోదా నియామక పత్రాన్ని వారి చేతుల మీదుగానే అందుకుంది. డీఎస్పీ పోస్టుతో పాటు.. 3 కోట్ల రూపాయల నగదుని కూడా ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం బహుమతిగా అందించింది. ఈ నేపథ్యంలో తనను డీఎస్పీ హోదాలో సత్కరించినందుకు యూపీ ప్రభుత్వానికి దీప్తి శర్మ కృతజ్ఞతలు తెలిపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా మహిళల క్రికెట్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొంది.

క్రికెటర్ దీప్తి శర్మ మాత్రమే కాదు.. ఇతర ఆటగాళ్లకు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రోత్సహకాలు అందించారు. పారా ఏషియన్‌ గేమ్స్‌లో భాగమైన అథ్లెట్లు జతిన్‌ కుష్వాహా, యశ్‌ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ప్రైజ్‌మనీని అందించారు. ఇక నేషనల్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన స్నూకర్‌ ఛాంపియన్ పరాస్‌ గుప్తా, రైఫిల్ షూటర్ ఆయుషి గుప్తాలకు కూడా రూ.5లక్షల చొప్పున బహుమతిగా అందించింది రాష్ట్ర ప్రభుత్వం.

Next Story