టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్

Team india coach rahul dravid. భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ రానున్నారు. టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ దావ్రిడ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

By అంజి  Published on  16 Oct 2021 5:15 AM GMT
టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్

భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ రానున్నారు. టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ దావ్రిడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అందరూ ఊహించినట్టుగానే రాహుల్‌ ద్రావిడ్‌కు కోచ్‌ పగ్గాలు అప్పజెప్పనుంది బీసీసీఐ. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం.. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌తో ముగియనుంది. దీంతో బీసీసీఐ కోచ్‌గా రాహుల్‌ దావ్రిడ్‌ను ఆ పదవిలో నియమించనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలి, సెక్రటరీ జైషాలు నిన్న రాహుల్‌ ద్రావిడ్‌తో భేటీ అయ్యారని స‌మాచారం. ఈ సమావేశంలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు ద్రావిడ్‌ ఒకే చెప్పారని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే వరల్డ్‌కప్‌ తర్వాత నుండి 2023 వరకు రాహుల్‌ దావ్రిడ్‌ హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడు.

అలాగే.. న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు ద్రావిడ్. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌.. ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా రాహుల్‌ ద్రావిడ్‌ రూ.10 కోట్లు అందుకోబోతున్నట్లు సమాచారం. నవంబర్‌ 14తో హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాథోడ్‌ కొనసాగుతుండగా.. ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధరన్‌ స్థానంలో ప‌రాస్ మాంబ్రేను తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే వరల్డ్‌కప్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు.


Next Story
Share it