జట్టులో ఆ ఇద్ద‌రు లేరు.. అవకాశాన్ని ఉపయోగించుకోండి: జయ సూర్య

భారత టీ20 జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడాన్ని శ్రీలంక జట్టు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సూచించారు.

By Medi Samrat  Published on  25 July 2024 7:00 PM IST
జట్టులో ఆ ఇద్ద‌రు లేరు.. అవకాశాన్ని ఉపయోగించుకోండి: జయ సూర్య

భారత టీ20 జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడాన్ని శ్రీలంక జట్టు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సూచించారు. శ్రీలంకతో T20 సిరీస్ జూలై 27న ప్రారంభం కానుంది. లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను కూడా లంక జట్టులోకి తీసుకున్నామని.. అలాగే జట్టుతో ఆరు రోజుల ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించినట్లు జయసూర్య వెల్లడించారు.

మేము LPL తర్వాత క్రికెట్ సెషన్‌లను ప్రారంభించాము. చాలా మంది ఆటగాళ్ళు ఎల్‌పిఎల్ ఆడుతున్నారు.. కాబట్టి వారు క్రికెట్‌తో బిజీగా ఉన్నారని భావిస్తున్నామన్నారు. టోర్నమెంట్ కోసం జట్టు సన్నద్ధత బాగానే ఉంది, T20 ప్రారంభానికి ముందు మేము క్యాండీలో మరో రెండు రోజులు ఉన్నామని జయసూర్య తెలిపారు. రాజస్థాన్ రాయల్ యొక్క హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ జుబిన్ భారుచాతో సెషన్స్ చాలా బాగా ఉన్నాయని, అతని నుంచి ఆటగాళ్లు చాలా నేర్చుకోగలిగారని జయసూర్య అన్నారు. అంతర్జాతీయ క్రికెటర్లుగా కొత్త మెళుకువలు, కొత్త విధానాలు, షాట్ మేకింగ్ ప్రభావవంతంగా ఉండాలంటే కొత్తకొత్తవి నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు జయసూర్య. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు.. వారి ప్రతిభ, వారు ఆడిన క్రికెట్‌ను చూస్తే వారు గొప్ప స్థాయిలో ఉన్నారని మనందరికీ తెలుసని జయసూర్య వివరించారు. ఇప్పుడు వాళ్లు గైర్హాజరు అవ్వడం భారత జట్టుకు తీవ్ర నష్టమే.. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని లంక జట్టు మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు జయ సూర్య.

Next Story