ఒకే ఓవర్‌లో 36 పరుగులు, పూరన్ వీరబాదుడు వీడియో
టీ20 వరల్డ్ కప్ 2024లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 5:45 AM GMTఒకే ఓవర్‌లో 36 పరుగులు, పూరన్ వీరబాదుడు వీడియో
టీ20 వరల్డ్ కప్ 2024లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. పాత చరిత్రను తిరగరాస్తున్నారు ఆటగాళ్లు. కివీస్ పేస్ బౌలర్ ఫెర్గూసన్ నాలుగు ఓవర్లు మేయిడిన్ చేసి.. మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇక వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. సెయింట్ లూసియా వేదికగా అప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయా వీరబాదుడు బాదాడు.
పూరన్ ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో 98 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు.. 8 సిక్సర్లతో రాణించాడు. పూరన్‌కు తోడుగా ఓపెనర్ చార్లెస్ 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దాంతో.. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ 218 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ క్రమంలోనే పూరన్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన పూరన్.. ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేశాడు. నాలుగో ఓవర్‌లో వేసిన అజ్మతుల్లాకు పూరన్ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. రెండో బంతిని ఫోర్ కొట్టగా.. అది నోబాల్‌గా ఇచ్చారు అంపైర్లు. ఒత్తిడితో అజ్తుల్లా ఫ్‌రీహిట్‌ను భారీ వైడ్ వేయడంతో మళ్లీ అది బౌండరీకి చేరి అదనంగా ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన ఫ్రీహిట్ బాల్‌కు పరుగేలమీ రాలేదు. ఆ తర్వాత మూడో బంతిని లెగ్‌బై రూపంలో బౌండరీ వచ్చింది. నాలుగో బంతిని పాయింట్ మీదుగా ఫోర్ కొట్టాడు పూరన్. ఐదో బంతిని 89 మీటర్ల దూరం సిక్స్‌ను బాదాడు. ఇక చివరి బంతిని కూడా లాంగాఫ్ మీదుగా సిక్స్ లా మల్చడంతో ఒకే ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి. దాంతో.. అరుదైన జాబితాలో పూరన్ చోటు సంపాదించుకున్నాడు.
ఒకే ఓవర్‌లో అధిక పరుగులు సాధించిన వారి జాబితాలో నిలిచాడు విండీస్ బ్యాటర్ పూరన్. టీ20 ల్లో ఓవర్లో 36 పరుగులే అత్యధికం. దీన్ని ఇప్పటి వరకు కొందరు ఒంటి చేత్తో, మరికొందరు పార్టనర్‌తో సాధించారు. టీమిండియా యువరాజ్ సింగ్ (స్టువర్ట్ బ్రాడ్-2007), కీరన్ పొలార్డ్ (ధనంజయ-2007), రోహిత్, రింకూ (కరీమ్ జనత్-2024), దీపేంద్ర సింగ్ (కమ్రాన్ ఖాన్-2024), పూరన్ & చార్లెస్ (అజ్మతుల్లా ఒమర్జాయ్- 2024) అధిక పరుగులు సాధించిన వారి లిస్ట్‌లో ఉన్నారు.