IND Vs ENG: ఆ తప్పే మమ్మల్ని ఓడించింది: జోస్ బట్లర్
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:05 AM ISTIND Vs ENG: ఆ తప్పే మమ్మల్ని ఓడించింది: జోస్ బట్లర్
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. 2022 టీ20 సెమీస్‌లో ఓడించినందుకు.. ఇప్పుడు అదే సెమీస్‌లో భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. 68 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.. ఫైనల్స్ కి వెళ్లింది. అయితే.. తమ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బౌలింగ్ వైఫల్యం వల్లే తాము ఓటమినిచూడాల్సి వచ్చిందన్నాడు. బౌలింగ్‌తాము 20 నుంచి 25 పరుగులు అదనంగా ఇచ్చామన్నారు. అవే తమ పతనాన్ని శాసించాయంటూ జోస్ బట్లర్ పేర్కొన్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 171 పరుగులు చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ గురించి బట్లర్ మాట్లాడుతూ.. టీమిండియా ఆడినతీరును అభినందించాడు. అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు తమకంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చారని చెప్పాడు. ఈ విజయానికి టీమిండియా పూర్తి అర్హులంటూ పేర్కొన్నాడు. సవాల్‌తో కూడుకున్న వికెట్‌పై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారని చెప్పాడు. అన్ని విభాగాల్లో తమ కంటే బెస్ట్ ఇచ్చారని బట్లర్ అన్నాడు. ఈ గెలుపు క్రెడిట్ భారత్‌దే. వాళ్లు మంచి క్రికెట్ ఆడారని బట్లర్ అన్నాడు.
వర్షం వచ్చే పరిస్థితుల నేపథ్యంలో పిచ్ ఇంతలా మారుతుందని ఊహించలేదన్నాడు బట్లర్. భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శన ఇచ్చారని చెప్పాడు. ఈ వికెట్‌పై చేయాల్సిన లక్ష్యం కంటే భారత్ ఎక్కువే చేసిందన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడమే తప్పిదంగా భావించడం లేదనీ.. భారత్‌కు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు. మొయిన్ అలీతో బౌలింగ్ చేయాల్సిందన్నాడు. అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో భారత్ మా ఓటమిని శాసించింది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టమన్నాడు. ఈ టోర్నీలో తమ జట్టు కనబర్చిన ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ అన్నాడు.