2026 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. వరుస విజయాలతో గ్రూప్ టాప్‌లో ఉంది. అమెరికా, నమీబియాపై ఘనవిజయాలు సాధించినప్పటికీ, లోలోపల ఒక ఆందోళన మాత్రం జట్టును వేధిస్తోంది. అదే.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బంది. రేపు కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు ఈ బలహీనత చర్చనీయాంశంగా మారింది.
గత రెండు మ్యాచ్‌లను గమనిస్తే.. వాంఖడే పిచ్‌పై అమెరికా స్పిన్నర్లకు 3 వికెట్లు, ఢిల్లీలో నమీబియా స్పిన్నర్లకు 5 వికెట్లు సమర్పించుకున్నారు. గెర్హార్డ్ ఎరాస్మస్ వంటి అనామక స్పిన్నర్లే భారత బ్యాటర్ల లయను దెబ్బతీశారు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి వారి స్ట్రైక్ రేట్ బాగున్నప్పటికీ.. తిలక్ వర్మ, సంజు శామ్సన్ స్పిన్ ఆడటంలో తడబడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఆకాశ్ చోప్రా, దినేష్ కార్తీక్ హెచ్చరిక:
మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చెబుతూ.. "స్పిన్ అనుకూలించే పిచ్‌లపై మన బ్యాటింగ్ తీరు మెరుగుపడకపోతే కష్టాల్లో పడతాం" అని హెచ్చరించారు. అటు దినేష్ కార్తీక్ సాంకేతిక కారణాలను విశ్లేషిస్తూ.. బ్యాటర్లు కేవలం స్ట్రైట్ హిట్టింగ్‌పైనే కాకుండా స్వీప్, ర్యాంప్ షాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
పాక్ స్పిన్ అటాక్
భారత్‌కు అసలైన సవాలు పాకిస్థాన్ స్పిట్ అటాక్ రూపంలో ఎదురుకానుంది. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, నవాజ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ తారిఖ్ వంటి ఐదుగురు నాణ్యమైన స్పిన్నర్లు పాక్‌కు ఉన్నారు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే, పాక్ ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని భారత్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.