టీమిండియాకు గ‌ట్టి షాక్‌.. హార్దిక్ దెబ్బ‌కు కుంటుతూ వెళ్లిపోయిన సిరాజ్‌..!

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌లో ఉంది.

By -  Medi Samrat
Published on : 21 Feb 2026 12:40 PM IST

టీమిండియాకు గ‌ట్టి షాక్‌.. హార్దిక్ దెబ్బ‌కు కుంటుతూ వెళ్లిపోయిన సిరాజ్‌..!

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌లో ఉంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ 2024 ప్రపంచ కప్ ఫైనల్‌ను గుర్తుకు తెస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. కానీ ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్ జ‌ట్టు ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ కప్‌కు ముందు నుంచే జట్టు గాయాల సమస్యలతో ఇబ్బంది పడుతోంది. జస్ప్రీత్ బుమ్రా , అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ఒక మ్యాచ్‌కు దూరమవగా, హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తీసుకున్నారు.

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సిరాజ్ ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో భారత్ కఠినమైన సవాలును ఎదుర్కోనున్న నేప‌ధ్యంలో జట్టులో మ‌రో ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్ కార‌ణంగా సిరాజ్‌ గాయపడ్డాడు. ఆ బంతి సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. సిరాజ్ నొప్పితో బాధపడుతూ నెట్స్ నుండి కుంటుతూ బయటకు వచ్చాడు. భారత జట్టు యాజమాన్యం జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ లకు ఎక్కువ మ్యాచ్ లను అప్పగించింది.

శుక్రవారం ప్రాక్టీస్ సమయంలో అందరి దృష్టి అభిషేక్ పైనే ఉంది. అభిషేక్ కోచ్ గౌతమ్ గంభీర్ తో చాలా సేపు చర్చించాడు. ఆయన అతనికి అనేక చిట్కాలు ఇవ్వడం కనిపించింది. తరువాత, అతను క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్పిన్ బౌలింగ్ కూడా చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ "అభిషేక్ గురించి ప్రత్యేకంగా ఎటువంటి చర్చ జరగలేదు, కానీ మేము ప్రపంచ కప్‌లో కీలకమైన దశను ఎదుర్కొంటున్నాము. అతని నుండి మంచి ప్రదర్శనను మేము ఆశిస్తున్నాము. అతను బంతిని బాగా కొడుతున్నాడు. అత‌డికి మంచి ప్రారంభం అవసరం.. స్లో పిచ్‌లపై, క్యూరేటర్లు ఉత్తమ పిచ్‌లను అందించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Next Story