అంపైర్లపై అనుమానం.. అసంతృప్తితో ఇంగ్లాండ్ ఓపెనర్..!

Suspicion on umpires England opener dissatisfied. టీమ్ఇండియాతో మూడో టెస్టు తొలి రోజున అంపైర్ల నిర్ణయాలతో అసంతృప్తి చెందినట్.

By Medi Samrat
Published on : 25 Feb 2021 12:06 PM IST

Suspicion on umpires England opener dissatisfied

టీమ్ఇండియాతో మూడో టెస్టు తొలి రోజున అంపైర్ల నిర్ణయాలతో అసంతృప్తి చెందినట్లు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ తెలిపాడు. 50-50శాతంగా ఉన్న అవకాశాల్లో వచ్చిన తీర్పులతో తీవ్ర నిరాశకు గురైనట్లు చెప్పాడు. భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మలను ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించగా.. అప్పీల్పై థర్డ్ అంపైర్ నాటౌట్ గా తేల్చారు. ఈ నిర్ణయంపై క్రాలీ అసహనం వ్యక్తం చేశాడు.

బుధవారం మొతేరాలో ప్రారంభమైన డేనైట్ టెస్టులో భారత్ స్పిన్ దెబ్బకు పర్యాటక జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్(6), అశ్విన్(3) ఆ జట్టును హడలెత్తించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 99 పరుగుల వద్ద నిలిచింది. క్రీజులో రోహిత్(57), రహానె(1) ఉన్నారు.

ఇది చాలా నిరాశ కలిగించింది. మేము ఆటలో వెనకబడి ఉన్నాం. 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు.. అవి మాకు అనుకూలంగా వస్తాయని ఆశిస్తాం. కానీ అలా జరగలేదు. అది బాధించింది. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు జాక్ లీచ్ 'ఔట్ సందర్భాన్ని' 5,6 కోణాల్లో పరిశీలించారు. అదే మేము ఫీల్డింగ్ చేసే సమయంలో ఒకే కోణం(రోహిత్, గిల్)లో చూసినట్టు అనిపించింది. అందుకే అసంతృప్తిగా ఉన్నాం అని క్రాలీ అన్నాడు.







Next Story