గెలిచే మ్యాచ్ అతని వల్లే ఓడిపోయాం: సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 5:20 AM GMTగెలిచే మ్యాచ్ అతని వల్లే ఓడిపోయాం: సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోన్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ ఘనవిజయాన్ని అందుకుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర సెంచరీతో కప్‌పై ఆశలను సజీవం చేసుకుంది. అయితే.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని అందుకుంది. కాగా.. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. తాము ఎలా ఓడిపోయామనే దానిపై వివరణ ఇచ్చారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేసి ఉంటే విజయం తమనే వరించేది అభిప్రాయం వ్యక్తం చేశాడు సూర్యకుమార్ యాదవ్.
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను త్వరగా ఔట్ చేయాలని బౌలింగ్ ప్రణాళికలో అనుకున్నామని సూర్య తెలిపాడు. అయితే.. 220 పరుగుల లక్ష్యం.. అలాగే విపరీతమైన డ్యూ ఉన్న పరిస్థితుల్లో కాపాడుకోవాలంటే బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందని అన్నారు. కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందు నుంచే ఏ అవకాశం ఇవ్వలేదన్నాడు. బౌండరీలు సాధిస్తూ మొదట్నుంచే తమ బౌలర్లపై ఒత్తిడి పెంచారని చెప్పాడు. అయితే.. మ్యాక్స్‌వెల్‌తో డేంజర్ అని అతన్ని ఔట్ చేసేందుకు ప్రణాళికలు చేసినా అవి ఫలించలేదని.. చివరకు ఆడి ఆసీస్ గెలిపించాడని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. చివరి వరకు అతన్ని ఔట్ చేయలేకపోయామని అన్నాడు.
ఒకవేళ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి ఉంటే మాత్రం విజయం తప్పకుండా సాధించేవాళ్లమని అన్నాడు సూర్య. అయితే.. 19వ ఓవర్ అక్షర్ పటేల్‌తో వేయడంపై స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్.. అనుభవం ఉన్న బౌలర్ అని ఆ 19వ ఓవర్ అక్షర్‌తో వేయించానని చెప్పాడు. గతంలో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన అనుభవం ఉండటంతోనే ఈ రిస్క్ తీసుకున్నట్లు చెప్పాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు అన్నాడు. ఏది ఏమైనా మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు చూపించిన పోరాటపటిమ పట్ల గర్వంగా ఫీలవుతున్నా అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఇక బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడని.. అతని ఆట ఎంతగానో నచ్చిందని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 పరుగలు చేసి నాటౌట్‌గా నిలిచాడు.