కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రీలంకతో ఆడుతున్న మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాడు సూర్యకుమార్.
By Srikanth Gundamalla
కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రీలంకతో ఆడుతున్న మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాడు సూర్యకుమార్. దాంతో.. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బౌలర్లను సమయానికి తీసుకొస్తూ ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపించాడు. ఈ విషయంలో సూర్యకుమార్‌ను మాజీ ప్లేయర్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు. అయితే. సూర్యకుమార్ మాత్రం కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తనని తాను కెప్టెన్‌గా కాకుండా ఒక నాయకుడిగా వర్గీకరించుకుంటానని సూర్యకుమార్ వెల్లడించాడు. తనకు కెప్టెన్‌గా ఉండాలని లేదని పేర్కొన్నాడు. జట్టుకు ఒక లీడర్‌గా ఉండాలని అనుకుంటన్నట్లు వ్యాఖ్యానించాడు. కీలక సమయంలో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను రెండో టీ20లో తీసుకురావడం గొప్ప నిర్ణయమని పలువురు అంటున్నారని తెలిపాడు. అతని బౌలింగ్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు సూర్య. ఐపీఎల్ సహా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు గమనించినట్లు చెప్పాడు. జట్టుకు రియాన్ అదనపు బలం అవుతాడని భావించామన్నాడు. శ్రీలంక టూర్‌లో అతని బౌలింగ్ ఉపయోగపడటం సంతోషకరమన్నాడు. సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ ఎక్స్‌వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
శ్రీలంకతో భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో బాగంగా రెండిట్లో భారత్ ఇప్పటికే గెలిచింది. 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే.. తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 9 ఓవర్లు ముగిసే సరికి 84/0గా ఉంది. ఆ సమయంలో సూర్య కుమార్ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు. అర్షదీప్, అక్షర్‌పటేల్ అవసరమైన సమయంలో దింపుతూ వికెట్లను తీయించాడు. ఇక సూర్య యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను కీలక సమయంలో రంగంలోకి దించాడు. అతడు ఏకంగా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సూర్య కెప్టెన్సీ నైపుణ్యాలను భారత మాజీ ప్లేయర్లు కూడా ప్రశంసిస్తున్నారు.