పారాలింపిక్స్‌.. భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం

Suhas Yathiraj wins silver medal in Tokyo Paralympics.టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sept 2021 8:36 AM IST
పారాలింపిక్స్‌.. భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం

టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు స‌త్తా చాటుతున్నారు. నిన్న ఒక్క రోజే నాలుగు ప‌త‌కాలు రాగా.. నేడు(ఆదివారం) భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం చేరింది. బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌(ర‌జ‌త ప‌త‌కం) సొంతం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగంలో సెమీస్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ఫైన‌ల్‌కు చేరిన సుహాస్‌.. ఫైన‌ల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ప‌రాజ‌యం పాలైయ్యాడు. దీంతో స్వ‌ర్ణం చేజారిన్ప‌ప‌టికి ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

కాగా.. ఈ పారాలింపిక్స్ పోటిలు ఈ రోజుతో ముగియ‌నున్నాయి. ఇక ముగింపు వేడుక‌ల్లో భార‌త ప‌త‌కాన్ని మ‌న‌దేశం త‌రుపున స్వ‌ర్ణం సాధించి తొలి మ‌హిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అవ‌ని చేబ‌ట్ట‌నుంది. అవ‌ని త్రివ‌ర్ణ ప‌త‌కాన్ని చేబూని ముందు న‌డ‌వ‌నుండ‌గా భార‌త్ నుంచి 11 మంది ఇందులో పాల్గొన‌నున్నారు.

Next Story