'సుగుణ సుందరి' వ‌చ్చేసింది.. ఇరగదీసిన బాల‌య్య‌

Suguna Sundari lyrical video song is out veerasimhareddy movie.నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 12:42 PM IST
సుగుణ సుందరి వ‌చ్చేసింది.. ఇరగదీసిన బాల‌య్య‌

నందమూరి బాలకృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సింహారెడ్డి'. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రీ మూవీ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే 'జై బాలయ్య' మాస్ బీట్‌ను విడుద‌ల చేయ‌గా తాజాగా రెండో పాట 'సుగుణ సుంద‌రి' ని నేడు(గురువారం)విడుదల చేసింది.

"సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే" అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను రామ్‌ మిర్యాల, స్నిగ్ధ శర్మ పాడారు. ఎస్‌ థమన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఇక శేఖర్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పులను బాలకృష్ణ తనదైన స్టైల్‌లో వేస్తూ అంద‌రి చేత ఈల‌లు వేయిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. బాల‌య్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Next Story