యాషెస్ సిరీస్‌లోని ఐదో, చివరి టెస్టు రెండో రోజైన శుక్రవారం రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీసి ఇంగ్లండ్ బౌలర్లు మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. లంచ్ తర్వాత.. స్టువర్ట్ బ్రాడ్ ఐదో బంతికి ఉస్మాన్ ఖవాజా (47)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (04)ని కూడా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా కేవలం యాషెస్‌లోనే 150 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఓవరాల్‌గా యాషెస్‌లో 150 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా.. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు. యాషెస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో షేన్ వార్న్(195), గ్లెన్ మెక్‌గ్రాత్(157).. స్టువర్ట్ బ్రాడ్ కంటే ముందున్నారు.
ఒక జట్టుపై 150 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన టెస్ట్ బౌలర్లు
195- షేన్ వార్న్ vs ఇంగ్లాండ్
167- డెన్నిస్ లిల్లీ vs ఇంగ్లాండ్
164- కర్ట్లీ ఆంబ్రోస్ vs ఇంగ్లాండ్
157- గ్లెన్ మెక్‌గ్రాత్ vs ఇంగ్లాండ్
151- స్టువర్ట్ బ్రాడ్ vs ఆస్ట్రేలియా
ఇదిలావుంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు సమాధానంగా.. ఆస్ట్రేలియా టీ విరామానికి ఏడు వికెట్లకు 186 పరుగులు చేసింది. టీ విరామం వరకు స్మిత్ 79 బంతుల్లో 40 పరుగులు చేసి క్రీజులో ఉండగా.. కెప్టెన్ పాట్ కమిన్స్ (01) ఖాతా తెరిచాడు. ఒకవైపు స్మిత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ని నడిపించే బాధ్యతను తమ మీద వేసుకున్నా.. జట్టు వికెట్లు మాత్రం పేకమేడలా కూలాయి.