ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ స్టార్ బౌల‌ర్‌

2023 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on  14 Aug 2023 6:00 PM IST
ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్‌.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ స్టార్ బౌల‌ర్‌

2023 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టీవెన్ ఫిన్ 2010 నుంచి 2017 వరకు 36 టెస్టు మ్యాచ్‌ల్లో 125 వికెట్లు, 69 వన్డేల్లో 102 వికెట్లు, 21 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. స్టీవెన్ ఫిన్ చివరిసారిగా 2017లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్‌నెస్‌ కారణంగా ఆట‌కు దూరంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

స్టీవెన్ ఫిన్ మాట్లాడుతూ.. ఈ రోజు నేను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి తక్షణమే రిటైర్ అవుతున్నాను. నేను గత ఒక సంవత్సరం నుండి పిట్‌నెస్‌తో యుద్ధం చేస్తున్నాను. అందుకే రిటైర్డ్ అవుతున్నాను. నా ప్రయాణం ఎప్పుడూ సులభంగా లేదు. కానీ నేను ఆనందంగా ఉన్నాను. ఇంగ్లండ్‌ తరఫున 36 టెస్టులు సహా 125 వ‌న్డే మ్యాచ్‌లు ఆడడం నా డ్రీమ్‌లో చాలా ఎక్కువ.. ఇకపై ఆడలేనందుకు క్షమించండని చెప్పుకొచ్చాడు. 6 అడుగుల 7 అంగుళాల పొడవు ఉన్న స్టీవెన్ ఫిన్ 16 ఏళ్ల వయసులోనే కౌంటీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Next Story