లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్ క్రికెటర్లు వీరే..
Star cricketers who were involved in sex scandals. పాకిస్థానీ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, వేధింపులకు సహకరించాడని
By Medi Samrat Published on 21 Dec 2021 1:07 PM ISTపాకిస్థానీ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, వేధింపులకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇస్లామాబాద్‌లోని షాలిమార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఓ క్రికెటర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు స్టార్ క్రికెటర్లు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది ప్రముఖ క్రికెటర్లను చూద్దాం.
1. షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి లేడీ ఫాలోయింగ్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అఫ్రిది వారిపట్ల స్మార్ట్‌గా వ్యవహరించలేదు. 2000వ సంవత్సరంలో క్రికెటర్లు అఫ్రిది, అతిక్-ఉజ్-జమాన్, హసన్ రజా తమ హోటల్ గదులలో కొంతమంది అమ్మాయిలతో పట్టుబడ్డారు.
2. క్రిస్ గేల్
వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రసిద్ది. అదే క్రమంలో గేల్ ఎప్పుడూ మహిళల సాంగత్యాన్ని ఆస్వాదిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. గేల్ టీ20 వరల్డ్ కప్-2012 సమయంలో శ్రీలంకలోని హోటల్ గదిలో ముగ్గురు బ్రిటీష్ మహిళలతో దొరికాడు. ఆ తర్వాత.. ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ బిగ్‌బాష్‌కు వెళ్లిన క్రిస్ గేల్ వ్యవహార తీరు అక్కడ కూడా వివాదస్పదమైంది. టీవీ ప్రెజెంటర్ మెల్ మెక్‌లాఫ్లిన్ పట్ల అభ్యకరంగా వ్యవహరించడంతో టోర్నీ నుండి సస్పెండ్ అయ్యాడు. అప్పుడు గేల్ చేసిన "డోంట్ బ్లష్, బేబీ" కామెంట్ వైరల్ అయింది.
3. షేన్ వార్న్
ఆస్ట్రేలియన్ మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆడుతున్న రోజుల్లో అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. వార్న్ ఒక బ్రిటీష్ నర్సును వేధించాడని ఆరోపణలు వచ్చాయి. 2006లో కౌంటీ ఛాంపియన్‌షిప్ గేమ్‌కు ముందు ఇద్దరు మోడళ్లతో సంబంధాలు కలిగి ఉన్నాడని వార్తలు వచ్చాయి. షేన్ వార్న్ ఓసారి మెల్‌బోర్న్ స్ట్రిప్పర్‌తో పట్టుబడటందో పాటు అనేక వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
4. కెవిన్ పీటర్సన్
మాజీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ కూడా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పీటర్సన్ ప్లేబాయ్ మోడల్ వెనెస్సా నిమ్మోతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వెనెస్సా నిమ్మో తమ ఆంతరంగిక రహస్యాలను బయటపెడుతూ.. కెవిన్ శృంగారం కోసం నిరాశగా ఉన్నాడు.. రోజంతా నన్ను ఇబ్బంది పెట్టాడని పీటర్సన్ పై సంచలన ఆరోపణలు చేసింది.
5. హెర్షెల్ గిబ్స్
దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ తన ఆత్మకథ 'టు ది పాయింట్' లో తాను అమ్మాయిలతో ఉన్న కొన్ని రహస్య ఘటనలను వెల్లడించి క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. గిబ్స్ ఆత్మకథలో.. "నేను సెంచరీ సాధించబోతున్నానని నాకు తెలుసు. బహుశా నా పక్కన మంచం మీద పడుకున్న అమ్మాయి నన్ను ప్రేరేపించి ఉండవచ్చు. నేను ఆమెతో స్నేహం చేసిన హోటల్‌లో ఆమె పనిచేసిందని సంచలనాలు బయటపెట్టాడు.