ఆసియా కప్ : పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
Sri Lanka vs Afghanistan Live Score. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా
By Medi Samrat Published on
27 Aug 2022 3:13 PM GMT

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు రెచ్చిపోయారు. బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలదొక్కుకోకుండా చావుదెబ్బ తీశారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి శ్రీలంక వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో భానుక రాజపక్స ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్‌హక్ ఫరూఖీ చెరో రెండు వికెట్లు తీశారు. నవీన్-ఉల్-హక్ ఒక వికెట్ తీశాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 60/5
శ్రీలంక XI : గుణతిలక, నిస్సాంక, కె మెండిస్, అసలంక, రాజపక్స, షనక, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, మధుశంక, పతిరణ
ఆఫ్ఘనిస్తాన్ XI : జజాయ్, గుర్బాజ్, జద్రాన్, జనత్, జద్రాన్, నబీ, రషీద్, ఒమర్జాయ్, నవీన్, ఉర్ రెహ్మాన్
Next Story