సన్‌రైజర్స్‌కు భారీ షాకిచ్చిన కేన్ మామ.. ఇంటికెళ్లిపోయాడు

SRH captain Kane Williamson is flying back to New Zealand.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో మంగ‌ళవారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 8:24 AM GMT
సన్‌రైజర్స్‌కు భారీ షాకిచ్చిన కేన్ మామ.. ఇంటికెళ్లిపోయాడు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో మంగ‌ళవారం రాత్రి ముంబై ఇండియ‌న్స్ పై మూడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకుంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. త‌న చివ‌రి మ్యాచ్‌ను మే 22న పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. పంజాబ్ పై విజ‌యం సాధించ‌డం హైద‌రాబాద్ ఎంతో ముఖ్యం. ఇలాంటి కీల‌క త‌రుణంలో హైద‌రాబాద్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చాడు ఆ జ‌ట్టు కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్‌.

బ‌యోబ‌బుల్‌ను వీడి స్వ‌దేశానికి బ‌య‌ల్దేరాడు. ఇందుకు కారణం కేన్ భార్య సారా ర‌హీం రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌డ‌మే. ఈ స‌మ‌యంలో త‌న భార్య ప‌క్క‌న ఉండాల‌ని కేన్ బావించాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుప‌గా వారు అందుకు అంగీక‌రించ‌డంతో విలియ‌మ్ స‌న్ స్వ‌దేశానికి బ‌య‌లుదేరాడు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

ఇక కేన్ గైర్హాజ‌రీలో పంజాబ్‌తో మ్యాచ్‌లో నికోల‌స్ పూర‌న్ లేదా భువ‌నేశ్వ‌ర్ కుమార్ జ‌ట్టును న‌డిపించే అవ‌కాశం ఉంది. పంజాబ్‌పై భారీ తేడాతో హైద‌రాబాద్ విజ‌యం సాధించినా..మిగ‌తా జ‌ట్ల ఫ‌లితాల‌పైనే స‌న్‌రైజ‌ర్స్ ప్లే ఆఫ్స్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.

Next Story
Share it