సన్‌రైజర్స్ కొత్త కోచింగ్ స్టాఫ్ వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ

SRH announce coaching staff for IPL 2022.స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. 2022 ఇండియ‌న్ ప్రీమియ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 9:34 AM GMT
సన్‌రైజర్స్ కొత్త కోచింగ్ స్టాఫ్ వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. 2022 ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)కు స‌రికొత్త‌గా స‌న్‌రైజ‌ర్స్ సిద్ద‌మ‌వుతోంది. 2016 సీజ‌న్‌లో డేవిడ్ వార్న‌ర్ నాయ‌క‌త్వంలో టైటిల్ గెలిచిన జ‌ట్టు.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి క‌ప్పును ముద్దాడ‌లేదు. ఇక వ‌చ్చే ఏడాది రెండు కొత్త జ‌ట్లు రానుండ‌డంతో వేలం నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కేవ‌లం ముగ్గురు ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే అట్టిపెట్టుకున్న రైజ‌ర్స్.. కోచింగ్ స్టాఫ్‌లో కూడా భారీ మార్పులు చేసింది.

రైజ‌ర్స్ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప‌రిచ‌యం చేస్తూ ట్విట‌ర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంపాటు రాణించిన దిగ్గ‌జాల‌ను ఈ సారి కోచింగ్ బృందంలో చేర్చింది. వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియ‌న్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించింది. ఆర్‌సీబీ మాజీ హెచ్ కోచ్ సైమ‌న్ క‌టిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక చేసింది. ఇక తొలి టైటిల్‌ను అందించిన టామ్‌మూడీని హెచ్‌కోచ్‌గా కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పింది. అదే విధంగా శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని పేర్కొంది.

ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఫాస్ట్ బౌల‌ర్ డేల్ స్టెయిన్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. కాగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో డేల్ స్టెయిన్ 699 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, డెక్క‌న్ చార్జ‌ర్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడి 97 వికెట్లు తీసుకున్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ సారి కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌తో పాటు అబ్దుల్ స‌మ‌ద్‌, ఉమ్రాన్ మాలిక్‌ను రిటైన్ చేసింది. విలియ‌మ్స‌న్‌కు రూ.14 కోట్లు, స‌మ‌ద్‌, ఉమ్రాన్‌కు చెరో 4 కోట్ల రూపాయ‌ల చొప్పున చెల్లించ‌నుంది. ఇక వేలంలో మంచి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

Next Story