Video : స్పాట్ ఫిక్సింగ్ వివాదం.. భారీ నోబాల్

న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో సాంప్ ఆర్మీ తలపడిన అబుదాబి T10 లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం చెలరేగింది.

By Medi Samrat  Published on  23 Nov 2024 8:05 AM IST
Video : స్పాట్ ఫిక్సింగ్ వివాదం.. భారీ నోబాల్

న్యూయార్క్ స్ట్రైకర్స్‌తో సాంప్ ఆర్మీ తలపడిన అబుదాబి T10 లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం చెలరేగింది. UAE పేసర్ హజ్రత్ బిలాల్ భారీ ఫ్రంట్-ఫుట్ నో-బాల్ వేయడంతో అబుదాబి T10 లీగ్ లో చర్చనీయాంశమైంది. స్పాట్ ఫిక్సింగ్ ఊహాగానాలకు దారితీసింది, టోర్నమెంట్ పై ఆందోళనలు, అనుమానాలు పెరుగుతున్నాయి.

మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిలాల్ నాలుగో ఓవర్ బౌలింగ్ కి వచ్చాడు, న్యూయార్క్ స్ట్రైకర్స్ 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 32-2తో పోరాడుతున్నారు. ఐదో డెలివరీగా బిలాల్ వేసిన నో-బాల్ అనుమానాలను పెంచింది. డెలివరీ వేసినప్పుడు ఒక అడుగు కంటే ఎక్కువ అడుగు ముందుకు వేయడం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్ ను డోనోవన్ ఫెరీరా ఎక్స్‌ట్రా కవర్‌పై సిక్సర్‌ కొట్టాడు.

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో సహా క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లు సోషల్ మీడియాలో ఈ లీగ్ పై ప్రశ్నించారు. అవినీతి, కుంభకోణాల కారణంగా అబుదాబి టి 10 లీగ్ వివాదాల్లో ఉంది. ఇప్పుడు ఈ నో బాల్ సంఘటన జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో, లీగ్‌తో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులపై ICC నిషేధం విధించింది. పుణె డెవిల్స్ బ్యాటింగ్ కోచ్ అషర్ జైదీ 2021 ఎడిషన్‌లో అవినీతి నిరోధక కోడ్‌లను ఉల్లంఘించమని ఇతరులను అభ్యర్థించడం సహా అవినీతి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు.

Next Story