బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్రికెటర్.. వీడియో వైరల్
Spinner Jack Leach Signs Autograph On Fan's Bald Head.సినీ నటులు, క్రీడాకారులకు ఉండే క్రేజ్ గురించి
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2022 3:42 PM ISTసినీ నటులు, క్రీడాకారులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఎక్కడ కనిపించినా.. ఆటోగ్రాఫ్‌లు, సెల్పీలు తీసుకునేందుకు అభిమానులు పోటిపడుతుంటారు. తమ అభిమాన ఆటగాళ్లు గానీ సినీ తారలు ఇచ్చే ఆటోగ్రాఫ్‌లను పేపర్‌పై లేదా వస్తువులపై తీసుకోవడం మనం ఇప్పటి వరకు చూశాం. అయితే.. ఓ వ్యక్తి ఏకంగా తన తలపైనే ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. బట్టతలపై క్రికెటర్ ఆటోగ్రాప్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. యాషెస్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆటకు పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని పలువరు అభిమానులు అతడిని కోరారు. వారి అభ్యర్థనను కాదనలేక జాక్ లీచ్ అభిమానులకు ఆటో గ్రాఫ్‌లు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఘటన మొత్తం మైదానంలోని లైవ్ స్రీన్‌లో ప్రసారం అయింది. దీంతో మైదానంలోని ప్రేక్షకులు చప్పట్లు, అరుపులతో హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.
Jack Leach signing a guy's head 😂 #Ashes pic.twitter.com/g6JL6xaqiC
— 7Cricket (@7Cricket) January 5, 2022