విరాట్‌ పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు

Sourav Ganguly says I like Virat Kohli's attitude.టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొల‌గించిన సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 10:02 AM GMT
విరాట్‌ పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్సీ తొల‌గింపుపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, విరాట్ కోహ్లీలు భిన్న స్వ‌రాలు వినిపించారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాలున్నాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా గురుగ్రామ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి గంగూలీ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ పై గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఇప్పుడున్న భార‌త ఆట‌గాళ్ల‌లో ఎవ‌రి యాటిట్యూడ్ నచ్చుతుంద‌ని విలేక‌రులు గంగూలీని ప్ర‌శ్నించారు. ఇందుకు దాదా ఇలా బ‌దులు ఇచ్చాడు. విరాట్ కోహ్లి వైఖరి(యాటిట్యూడ్‌) అంటే త‌న‌కు చాలా ఇష్టమ‌న్నాడు. అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడు. కానీ కోపం ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. జీవితంలో ఒత్తిడి ఉండ‌ద‌ని దాదా చెప్పాడు. మనకు ఒత్తిడిని భార్య, స్నేహితులు మాత్రమే ఇస్తారు అని సరదాగా గంగూలీ వ్యాఖ్యానించాడు.

Advertisement

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌కు ముందు విరాట్ కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కొంత వ్య‌తిరేక‌త రాగా.. విరాట్ కోహ్లీని టీ 20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌ద్ద‌ని చెప్పాన‌ని అయితే.. అత‌డు త‌న మాట విన‌లేద‌ని గంగూలీ చెప్పాడు. కాగా.. త‌న‌తో ఎవ‌ర్వూ ఈ విష‌యం గురించి చ‌ర్చించ‌లేద‌ని.. త‌న‌ను తొల‌గించ‌డానికి కేవ‌లం గంట‌న్న‌ర ముందే స‌మాచారం ఇచ్చార‌ని కోహ్లీ ద‌క్షిణాఫ్రికాకు వెళ్లే ముందు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చెప్పాడు. ఇక ఇదే విష‌యాన్ని గంగూలీ వ‌ద్ద ప్ర‌స్తావించగా.. త‌న మాట‌ల‌కు పూర్తి వ్య‌తిరేకంగా మాట్లాడిన కోహ్లీ విష‌యాన్ని బీసీసీఐ చూసుకుంటుంద‌ని దాన్ని మీడియా వ‌దిలివేయాల‌ని కోరాడు.

Next Story
Share it