వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఇంకో బెటర్ మ్యాచ్ ఉందట..!

Sourav Ganguly rates rivalry between India vs Australia higher than India vs Pakistan. భారత్ లో ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వహించనున్నారు.

By Medi Samrat
Published on : 2 July 2023 9:15 PM IST

వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఇంకో బెటర్ మ్యాచ్ ఉందట..!

భారత్ లో ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వహించనున్నారు. టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారు అయిన‌ప్ప‌టి నుంచి భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ మాత్రం ఈ మ్యాచ్ కంటే మరో గొప్ప మ్యాచ్ ఒకటి ఉందని చెప్పుకొచ్చారు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ కంటే భార‌త్, ఆస్ట్రేలియా పోరు గొప్ప‌గా ఉంటుంద‌ని దాదా తెలిపారు. భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్‌పై చాలా హైప్ ఉన్నప్పటికీ భారత్ ఈ మ్యాచ్ లో పాక్ దుమ్ముదులపడం ఖాయమని సౌరవ్ తెలిపారు. రెండు జ‌ట్ల మ‌ధ్య హోరాహోరీ పోరాటం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చని అన్నారు. చాలా కాలం నుంచి ఐసీసీ(ICC) టోర్న‌మెంట్‌ల‌లో భార‌త జ‌ట్టు పాకిస్థాన్‌ను ఓడిస్తూ వ‌స్తోందని.. నా దృష్టిలో భార‌త్, ఆస్ట్రేలియా మ్యాచ్ గొప్ప‌గా ఉండ‌నుందని గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల్లో భాగంగా అక్టోబ‌ర్ 8న ఆసీస్‌తో, అక్టోబ‌ర్ 15న అహ్మ‌దాబాద్ వేదిక‌గా పాక్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో రెండు మ్యాచులు ఆడబోతున్న పాకిస్తాన్ జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో మిగిలిన వరల్డ్ కప్ మ్యాచులు ఆడనుంది. పాకిస్తాన్ సెమీస్‌కి అర్హత సాధిస్తే.. కోల్‌కతా లో సెమీ ఫైనల్ ఆడనుంది. వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయిన తరువాత వెంటనే పీసీబీ స్పందించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. భారత్‌కు తమ జట్టును పంపిస్తామని స్పష్టం చేసింది. ఇది భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతనే తమ నిర్ణయం ఉంటుందని పీసీబీ అధికారి తెలిపారు. ప్రపంచకప్‌ కోసం భారత్‌కు వెళ్లేందుకు అధికారిక అనుమతి కోరుతూ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటర్నల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది పీసీబీ.


Next Story