సోనుసూద్ కు అరుదైన గౌర‌వం

Sonu Sood becomes the Brand Ambassador at Special Olympics.క‌రోనా క‌ష్ట‌కాలంలో తాను ఉన్నానంటూ ముందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 7:14 AM IST
సోనుసూద్ కు అరుదైన గౌర‌వం

క‌రోనా క‌ష్ట‌కాలంలో తాను ఉన్నానంటూ ముందుకు వ‌చ్చాడు బాలీవుడ్ న‌టుడు సోనుసూద్‌. లాక్‌డౌన్‌లో వ‌ల‌స‌కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంప‌డంతో మొద‌లైన సోనుసూద్ సేవ‌లు నేటికి కొన‌సాగుతున్నాయి. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలిచేందుకు ఆయ‌న ఎన్నో ర‌కాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేద‌న‌కుండా ఆదుకుంటున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూసి స్పందించిన సోను సూద్ మంచి మ‌న‌సుకు ఒక్క భార‌త‌దేశ ప్ర‌జ‌లే కాదు.. ప్ర‌పంచ‌మే ఫిదా అయ్యింది.

తాజాగా ఈ రియ‌ల్ హీరోకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎస్‌వో భారత్‌ జట్టుకు​ ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఈ పరిణామంపై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్‌పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం ప్రకటించారు. ప్రత్యేక ఒలింపిక్స్ కుటుంబంలో చేరేందుకు తమ ఆహ్వానాన్ని మన్నించిన సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలోని కజాన్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగనున్నాయి.

Next Story