స్మృతి మంధాన.. సరికొత్త రికార్డు..!
Smriti Mandhana Creates World Record, Becomes First Cricketer to Hit 10 Consecutive Fifty-Plus Scores in ODIs While Chasing. స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 10 March 2021 6:33 PM ISTదక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో మిథాలీ రాజ్ సేన విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత టీమ్ కేవలం 28.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది 2 మ్యాచ్‌ల తరువాత, ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమానంగా ఉంది. రెండో వన్డేలో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మహిళలు మొదటగా బ్యాటింగ్ చేశారు. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (10-0-42-4) నాలుగు వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (80 నాటౌట్; 64 బంతుల్లో 10×4, 3×6) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. పూనమ్ రౌత్ (62 నాటౌట్; 89 బంతుల్లో 8×4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జెమిమా రోడ్రిగ్స్ (9) విఫలమైంది.
ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మంధాన ఛేజింగ్ వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. 2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ మంధాన 50+ స్కోర్లు చేసింది. 67, 52, 86, 53, 73, 105, 90, 63, 74, 80తో రాణించింది. ఇంగ్లాండ్‌పై 3, ఆసీస్, న్యూజిలాండ్‌పై 2, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై ఒక్కోసారి స్మృతి మందాన 50+ స్కోరు సాధించింది. పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేదు. పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ వరుసగా 9 అర్ధ శతకాలు చేశాడు. ప్రత్యేకించి ఛేజింగ్ ల్లో మాత్రం చేయలేదు. విరాట్ కోహ్లీ కూడా ఛేజింగ్ లో చేసింది వరుసగా 5 అర్ధ శతకాలే మాత్రమే. దీంతో అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది స్మృతి మంధాన. అరుదైన రికార్డు అందుకున్నందుకు పలువురు క్రీడా పండితులు స్మృతి మంధానను ప్రశంసిస్తూ ఉన్నారు.