ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక గులాబి టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్ఉమెన్, ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. పింక్‌బాల్ టెస్టులో శతకంతో సత్తా చాటింది. దీంతో గులాబీ పోరులో టెస్టుల్లో భారత మహిళల జట్టు తరుపున తొలి శతకం సాధించిన బ్యాట్స్ఉమెన్‌గా ఆమె ఘనతను సొంతం చేసుకుంది. 171 బంతుల్లో మందాన ఈ ఘనతను అందుకుంది. మొత్తంగా 216 బంతులను ఎదుర్కొన్న మందాన 22 పోర్లు, ఓ సిక్సర్ సాయంతో 127 పరుగులు చేసి ఔటైంది.
నిజానికి తొలి రోజే ఆమె సెంచరీ చేసేలా కనిపించినా.. వర్షం అడ్డుపడటంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో ఆమె 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగించిన మంధాన.. ఆట ప్రారంభమైన కాసేపటికే శతకాన్ని సాధించింది. రెండో రోజు లంచ్ విరామానికి భారత మహిళల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మిథాలీ రాజ్ 15, బాటియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.