వార్ వన్ సైడ్.. ఆసియా కప్ ఫైనల్ సాగిందిలా..

ఆసియా కప్ ఫైనల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు ఎదురుచూడగా..

By Medi Samrat  Published on  17 Sept 2023 6:35 PM IST
వార్ వన్ సైడ్.. ఆసియా కప్ ఫైనల్ సాగిందిలా..

ఆసియా కప్ ఫైనల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్ అభిమానులు ఎదురుచూడగా.. భారత బౌలర్లు మ్యాచ్ ను వన్ సైడ్ చేశారు. ఏ మాత్రం శ్రీలంక బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. 6.1 ఓవర్లకు భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ వేగంగా ఛేజ్ చేయడంతో 8వ సారి ఆసియా కప్ ను భారత్ ముద్దాడింది. ఇషాన్ కిషన్ 23 పరుగులతో.. గిల్ 27 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాట్స్ మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోనివ్వకుండా చేశాడు. సిరాజ్ ధాటికి ఓ దశలో లంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (17), వెల్లలాగే (8), దుషాన్ హేమంత (13 నాటౌట్) కారణంగా 50 పరుగులైనా చేయగలిగింది. సిరాజ్ మాత్రమే కాకుండా హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 1 వికెట్ తీశారు.

Next Story