50 కే లంక ఆలౌట్.. సిరాజ్ రికార్డుల మోత
శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరుగుతోన్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు.
By Medi Samrat Published on 17 Sep 2023 12:06 PM GMTశ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరుగుతోన్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. 15.2 ఓవర్లలో 50 పరుగులకే శ్రీలంక ను ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లు, హర్దిక్ పాండ్యా మూడు వికెట్లు, జస్ప్రీత్ బూమ్రా ఒక వికెట్ తీశారు. మ్యాచ్ మొదలైన మూడో ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన శ్రీలంక జట్టుకు ఏ మాత్రం కలిసి రాలేదు. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఆరో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ పెరీరా, కెప్టెన్ దసున్ షనక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక సున్నా వద్ద ఔట్ కాగా, పాతుమ్ న్‌సంక 2 పరుగులు చేసి డిసిల్వా 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎవరూ పెద్దగా రాణించలేదు. 50 పరుగుల మార్కును దాటగలిగింది శ్రీలంక.
ఆసియాకప్ 2023 ఫైనల్‍లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. తన తొలి 16 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసి లంకను కుప్పకూల్చాడు. వన్డేల్లో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డేలో అత్యంత వేగంగా (16 బంతులు) 5 వికెట్లు పడొగట్టిన భారత బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యంత వేగంగా ఐదు వికెట్లను పడగొట్టిన అంతర్జాతీయ రికార్డు (చమింద వాస్ - 16 బంతులు)ను కూడా సిరాజ్ సమం చేశాడు.